calender_icon.png 27 October, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవ తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించాలి

27-10-2025 04:37:12 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో ప్రతి పాఠశాల 100 శాతం ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. సోమవారం సెండ్ థామస్ హైస్కూల్లో స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రత్యేక కార్యచరణ రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు. సిలబస్ను త్వరగా పూర్తిచేసి ఉదయం సాయంత్రం వేళలో స్టడీ అవర్స్ నిర్వహించాలని ప్రతి విద్యార్థి పేరును యుడైస్ లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.