7 July, 2026 | 7:58 PM

Breaking News

ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి   •   రహదారిపై వరి నాట్లు వేస్తూ నిరసన   •   రోడ్డు భద్రత, ఆటో రిక్షాలో ప్రయాణం, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన   •   మృతుడు బొల్లె ప్రశాంత్ కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సహాయం   •   జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి   •   బాన్సువాడ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటి   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   ఐకెపి రుణాలలో తాండూర్ అత్యధిక ఓవర్ డ్యూ   •   సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •  

23.5 లక్షల కోట్లకు ఫండ్స్ ఆస్తులు

15-05-2024 12:12 AM

న్యూఢిల్లీ, మే 14: మదుపరులు వారి బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్లను మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లిస్తున్న నేపథ్యంలో ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు జోరుగా పెరుగుతున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ ఆస్తులు 35 శాతం వృద్ధిచెందినట్టు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ (యాంఫి) తెలిపింది. 2021 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ సాధించిన 41 శాతం వృద్ధి తర్వాత ఇదే అత్యుత్తమ వృద్ధిగా అసోసియేషన్ పేర్కొంది. మెరుగైన రాబడి వస్తుందన్న భావనతో కస్టమర్లు వారి కరెంట్, సేవింగ్స్ ఖాతాల్లో డిపాజిట్లను ఫండ్స్‌లోకి మళ్లిస్తున్నందున ఫండ్స్ ఆస్తులు పెరుగుతున్నాయని యాంఫి చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని చెప్పారు. వ్యక్తిగత ఇన్వెస్టర్లు ఈక్విటీ, హైబ్రీడ్ ఫండ్స్‌లో పెట్టుబడి చేస్తున్నారన్నారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు 55 శాతం వృద్ధిచెంది రూ.23.5 లక్షల కోట్లకు చేరగా, హైబ్రీడ్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు 50 శాతం పెరిగి రూ.7.2 లక్షల కోట్లకు చేరాయి. ఈక్విటీ మార్కెట్లు జోరుగా పెరిగినందున, ఈ ఫండ్స్ ఆస్తులు సైతం భారీగా వృద్ధిచెందాయి.