29 May, 2026 | 3:30 AM

నా తెల్లపోరి.. బల్లి కంటే తెల్లగుంటది..

29-05-2026 02:41 AM

వన్ సైడ్ లవ్‌స్టోరీలో ఉన్న మ్యాడ్‌నెస్‌ను ప్రేక్షకులకు చూపించబోతోంది ‘దీవాన’ చిత్రం. ఈ సినిమా నుంచి తాజాగా ఓ టీజింగ్ సాంగ్ ‘తెల్లపోరి..’ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘తెల్లపోరి.. నా తెల్లపోరి బల్లి కంటే తెల్లగుంటది.. మెత్తమెత్త బుగ్గలు.. పందిపిల్ల పెదవులు.. గింతకంటే క్యూటు పిల్ల యాడ ఉంటది..’ అంటూ సాగుతున్న ఈ పాటను ఈశ్వర్ చంద్ రాసి, స్వరపర్చి, పాడటం విశేషం. ఈ పాటకు ‘ది క్రింజ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అనే క్యాప్షన్ మంచి జస్టిఫికేషన్ ఇస్తోంది.  వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్న ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి హీరో. ఈ చిత్రంతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: వం శీ పచ్చిపులుసు; ప్రొడక్షన్ డిజైన్: ఝాన్సీ గోజల; ఎడిటర్: హృషికేశ్.