29 May, 2026 | 3:49 AM

రొటీన్ హారర్స్‌కు భిన్నంగా..

29-05-2026 02:37 AM

టాలీవుడ్‌లో కొత్త తరహా మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజాచిత్రం ‘త్రికాల’. ‘ఎ స్క్రిప్ట్ ఆఫ్ గా డ్’ అనేది ఉపశీర్షిక. కర్మ సిద్ధాం తం, పునర్జన్మ, తాంత్రిక శక్తులు, మానసిక భయం, మానవ భావోద్వేగాలను ఒకే కథలో మిళితం చేసి, విజువల్ వండర్‌గా తెరకెక్కించారు దర్శకుడు మణి తెల్లగూటి. చాగంటి ప్రొడక్షన్ బ్యానర్‌పై రూ పొందిన ఈ సినిమా గురువారం విడుదలైంది. మరి ప్రేక్షకులకు మెప్పిం చిందా? 

కథ ఏంటంటే..? 

శతాబ్దాల క్రితం ’కుమారి ఖం డం’ అనే ఒక పౌరాణిక భూభాగంలో కథ ప్రారంభమవుతుంది. అక్కడి మునులు అత్యంత శక్తిమంతమైన తాంత్రిక గ్రంథాలు, ప్రాచీన సాంకేతిక రహస్యాలను అసురుల చేతికి చిక్కకుండా రహ స్య ప్రదేశంలో దాచిపెడతారు. ఆ రహస్యాలను కాపాడేందుకు ‘శక్తి ఏథా’ అనే దైవిక ఆయుధాన్ని సృష్టించి, దానిని వీరరాజు త్రికాల వర్మకు అప్పగిస్తారు. అసుర శక్తులపై పోరాడుతూ అతడు మర ణించగా, రుషులు అతని ఆత్మను ఒక మాయా అండంలో బంధిస్తారు.

కలియుగంలో ప్రపంచా నికి భారీ ముప్పు వచ్చినప్పుడు ఆ ఆత్మ మళ్లీ మేల్కొంటుందని వారు చెబుతారు. ఇక ఈ కథ వర్తమానంలో శివ (మాస్టర్ మహేంద్రన్) అనే యువకుడు అదృశ్యమైన తన ప్రేయసి నిధి (సాహితి) కో సం నగరం చేరుకుంటాడు. అతని దగ్గర ఒక దుష్టశక్తి ఆవహించిన ఓ మొబైల్ ఫోన్ ఉంటుంది.

ఈ క్ర మంలో అతనికి వైతరణ్ (అజయ్) అనే విచిత్రమైన వ్యక్తి గు రించి తెలుస్తుంది. సూర్యరశ్మిని తట్టుకోలేని పోర్ఫిరియా’ వ్యాధితో బాధపడుతున్న ఈ వైతరణ్ ఎవరు? కుటుంబ సంఘర్షణలు, మానసిక వేదనలతో అతను తన తండ్రిని, పినతల్లి (ఆమని)ని హత్య చేసి, ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేంటి? అతని ఆత్మ సంచరిస్తున్న బంగళాలోకి సైకియాట్రిస్ట్ మాయ (శ్రద్ధా దాస్) ఎందుకు వచ్చింది? శివకు ఈ కథతో ఉన్న సంబంధమేంటి? చివరకు అసుర శక్తులపై విజయం సాధించారా? అనేదే సినిమా అసలు కథ. 

మెప్పించే అంశాలివే.. 

ఈ సినిమాలో అత్యంత బలమైన అంశం దాని కాన్సెప్ట్. కర్మ సిద్ధాంతాన్ని కేవలం డైలాగ్స్ రూపంలో కాకుండా, పాత్రల మానసిక స్థితి, వారి గతం, పునర్జన్మల ద్వారా చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. పౌరాణికతను ఆధునిక ప్రపంచంతో మిళితం చేయడం సినిమాకున్న ప్రధాన బలం. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమి టంటే.. భారీ సెట్లు లేకపోయినా, ఫ్రేమ్ కంపోజిషన్, డిజిటల్ ఎక్స్‌టెన్షన్స్, సీజీఐ బ్యాక్‌డ్రాప్స్ ద్వారా గ్రాండ్ విజువల్ స్కేల్ తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

చాలా సన్నివేశాల్లో ‘హాలీవుడ్ డార్క్ ఫాంటసీ’ తరహా విజువల్ టోన్ కనిపిస్తుంది. నటీనటులు, సాంకేతికత సిబ్బంది పనితీరు మెచ్చుకునేలా ఉంది. నిర్మాత రాధికా శ్రీనివాస్ ఈ సినిమాను చాలా భారీ నిర్మాణ విలువలతో నిర్మించారు. మొత్తంగా చెప్పాలంటే.. ‘త్రికాల’ రొటీన్ హారర్ సినిమా కాదు. ఇది మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ, విజువల్ థ్రిల్లర్ల మేళవింపు. 

సమీక్ష

సినిమా: త్రికాల

నటీనటులు: శ్రద్ధాదాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని, సాహితి అవంచ, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి తదితరులు; డీవోపీ: పవన్ చెన్న; సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, షాజిత్ హుమాయున్; నిర్మాతలు: రాధికశ్రీనివాస్; కథ, దర్శకత్వం: మణి తెల్లగూటి; విడుదల: 28 మే, -2026.