ఆ మైండ్‌సెట్‌ను మార్చడమే నా లక్ష్యం
సమంత తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’పై నిర్మించి, నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’ టాలీవుడ్‌లో సోలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సమంత తన కెరీర్, అనారోగ్యం, ప్రొడక్షన్ హౌస్ గురించి పంచుకున్న ముఖ్యమైన విషయాలు పంచుకుంది. “మయోసైటిస్ బారిన పడిన ప్రారంభ రోజుల్లో, నాకున్న ఆరోగ్య సమస్యల కారణంగా నిర్మాతలు, దర్శకులు తనను సినిమాల్లోకి తీసుకునేందుకు వెనుకాడతారేమోనని తీవ్ర ఆందోళనకు గురయ్యా. ఆ భయం నుంచి బయటపడటానికి సొంతంగా సినిమాలు నిర్మించడం ప్రారంభించాను.
దీనివల్ల నాకు క్రియేటివ్ స్వతంత్రత రావడమే కాకుండా కెరీర్ పరంగా భద్రతా భావం కలిగింది. ఇప్పుడు నా చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఆ భయాలన్నీ తొలగిపోయాయి. సాధారణంగా సన్నగా, నాజూగ్గా ఉండే అమ్మాయిలు యాక్షన్ సీన్స్ చేస్తే ప్రేక్షకులు అంత త్వరగా అంగీకరించరనే అభిప్రాయం పరిశ్రమలో ఉంది. ఆ మైండ్‌సెట్‌ను మార్చడమే నా లక్ష్యం. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్‌లలో నా యాక్షన్ సీన్స్‌కు వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయాను. సెట్స్‌లో దెబ్బలు తింటూ ఫైట్స్ చేయడం నాకు ఎంతో కిక్ ఇస్తుంది” అని తెలిపింది.






