calender_icon.png 8 October, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా గుండె గాలిపటమల్లే ఎగరేశావే..

07-10-2025 12:00:00 AM

రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజాచిత్రం ‘మాస్ జాతర’. భాను బోగవరపు దర్శకత్వంలో  సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫా ర్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తు న్నా రు. ఈ సినిమా అక్టోబర్ 31న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో టీమ్ ప్రమోషన్స్‌లో జోరు పెంచేసింది. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ‘హుడి యో హుడియో’ అనే ఓ మెలోడీ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.

‘నా గుండె గాలిపటమల్లే ఎగరేశావే.. నీ చుట్టూపక్కల తిరిగేలా గిరి గీశావే.. నా కంటి రెమ్మల్లో కలలకు ఎర వేశావే.. నీ కం టిచూపుల్తో కలలను ఉరి తీశావే..’ అంటూ సాగుతున్న ఈ సాంగ్ ప్రోమో శ్రోతల హృదయాలను రంజింపజేస్తోంది. ఈ పాటకు దేవ్ సాహిత్యం అందించగా భీమ్స్ సిసిరోలియో స్వరపరుస్తూ హేశం అబ్దుల్ వాహద్‌తో కలిసి పాడారు. పూర్తి గీతం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ చిత్రానికి మాటలు: నందు సవిరిగాన; డీవోపీ: విధు అయ్యన్న; ఎడిటింగ్: నవీన్ నూలి; ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల.