03-12-2025 12:49:20 AM
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న డివైన్ యాక్షన్ చిత్రం ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా అలరించనున్నారు. డిసెంబర్ 5న ఈ చిత్రం 2డీ, 3డీ ఫార్మాట్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త విలేకరులతో ఈ చిత్ర విశేషాలను పంచుకుంది.
ఇప్పుడు నేను తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తుండటం -ఆనందంగా ఉంది. ‘విరూపాక్ష’ తర్వాత చాలా సినిమా లొచ్చా యికానీ, నేను సెలెక్టెడ్‌గాచేస్తున్నా. బింబిసార, విరూపాక్ష, సార్, భీమ్లానాయక్ ఒకేసారి ఓకే చేశా. అయితే రిలీజ్ టైమ్స్ డిఫరెంట్‌గా అయ్యాయి. తర్వాత స్వయంభు, నారీ నారీ నడుమ మురారి, ఆ తర్వాత ‘అఖండ 2’ సైన్ చేశా. చివరగా పూరి సినిమా ఒప్పుకున్నా. -ప్రతి కథలో కంటెంట్ నచ్చే చేస్తున్నా.
డైరెక్టర్ బోయపాటి ఈ కథ గురించి చెప్పగానే డేట్స్ ఉన్నాయో.. లేదోనని మా టీమ్‌ను అడిగా.. లేవన్నా రు. ఎలాగైనా ఈ సినిమా చేయాలని చెప్పాను. అప్పుడు వాళ్లు డేట్స్ అడ్జస్ట్ చేశారు. బోయపాటి చాలా గ్రేట్ విజన్‌తో సినిమా తీశారు.. మన ఊహకు మించి ఉంటుంది.
ఈ సినిమాలో నా పాత్ర వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్‌లో చాలా కీలకంగా, స్టులిష్‌గానూ ఉంటుం ది. సినిమా లో సాంగ్ చేయాలని చెప్పారు. పాట విన్న తర్వాత నిజంగా చాలా నెర్వస్‌గా అనిపించింది. అం త మాస్ సాంగ్ నేనెప్పుడూ చేయలేదు. కానీ, అద్భుతంగా చేయాలనైతే నిర్ణయించుకున్నా. రెండ్రోజుల ప్రాక్టీస్‌తో మోకాళ్ల నొప్పులు వచ్చాయి. థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు వినోదం పంచాలన్నదే నా ఫైనల్ గోల్. ఫిజియోథెరపీ తీసుకొని చేసేశా.
బాలయ్య చాలా స్నేహశీలి. ఆయన్ను తొలిసారి ఒక యాడ్ షూట్‌లో కలిశా. అప్పుడే నేను ఎంతో పరిచయం ఉన్న మనిషిలా మాట్లాడారు. ఆయన డైరెక్టర్ యాక్టర్.. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారు. ఆయనలో ఆ లక్షణం నాకు చాలా నచ్చింది. ఆయనతో పని చేయడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
ఇప్పటివరకు విడుదలైన పాటలన్నిటికీ అద్భుత స్పందన వచ్చింది. ఇందులో పాటలు శివుడికి నివేదనలాగా ఉండబోతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
నా కెరీర్‌లో ఎక్కువగా మైథలాజికల్ సినిమాలు వస్తున్నాయి. అయితే, ఇది నేను ముందే అనుకున్నది కాదు. సహజంగా, యాదృచ్ఛికంగా జరుగుతోంది.
రామ్, గోపి చాలా మంచి నిర్మాతలు. చాలా ప్రోత్సాహకంగా ఉంటారు. వారి సహకారం లేకపోతే ఇంత పెద్ద సినిమా చేయడం సాధ్యం కాదు. ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా అద్భుతంగా చేశారు.
తెలుగు ప్రేక్షకులు నెక్స్ లెవెల్. వాళ్లు సినిమా ఫస్ట్‌డేను సెలబ్రేట్ చేసుకోవడం చూస్తే మనం సక్సెస్‌కు ఆడిట్ అయిపోతాం.
‘స్వయంభు’లో యాక్షన్ క్యారెక్టర్ చేస్తున్నా. శర్వానంద్‌తో ‘నారి నారి నడుమ మురారి’లో చాలా మంచి పాత్రలో నటిస్తున్నా. డైరెక్టర్ పూరితో కలిసి పనిచేయడం వల్ల మంచి అనుభూతి పొందాను.
అఖండ2 టికెట్ ధరల పెంపు
‘అఖండ2’ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాతలకు అనుమతిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లలో రూ.75, మల్టీఫ్లెక్స్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి) ధర పెంచుకునేలా అవకాశం కల్పించింది. రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేలా వెసులుబాటు కల్పించారు.
పెంచిన ధరలు సినిమా విడుదల తేదీ నుంచి వరుసగా 10 రోజుల పాటు అమలులో ఉంటాయి. ఇదిలావుండగా, సినిమా విడుదలకు ఒక రోజు ముందు.. అంటే ఈ నెల 4న రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య ప్రీమియర్ షోలకు సైతం అనుమతులు జారీ చేసింది. ప్రీమియర్స్‌కు సంబంధించి టికెట్ ధరలు రూ.600 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించారు.