17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఫోన్ ట్యాపింగ్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలి

26-06-2025 01:20 AM

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 

కామారెడ్డి, జూన్ 25 (విజయ క్రాంతి), ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కోరారు. బుధవారం సీట్ దర్యాప్తు బృందం అధికారులు ముందు హాజరై అసెంబ్లీ ఎన్నికలలో తనకు జరిగిన అడ్డంకులు పోలీసుల ఇబ్బందులను వివరించారు. అప్పటి డీఎస్పీ ఆధ్వర్యంలో మూడుసార్లు తన ఇంటిపై రాత్రికి వచ్చి పోలీసులు హంగామా చేస్తూ భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు.

కామారెడ్డి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి కి ప్రచారంలో సహకరించడం వల్లనే తమపై నిగా పెట్టి తాము ఎటు వెళ్తున్నామని విషయాలను ఫోన్ టాపింగ్ ద్వారా గుర్తించారని అప్పట్లో తాము ఆరోపణ కూడా చేసామని తెలిపారు.

తనతోపాటు తన కారు డ్రైవర్ అశోక్, పిఏ, కరుణాకర్ రెడ్డి, అరవింద్ కుమార్ ల ఫోన్ టాపింగ్ చేశారని ఈ విషయం వై వాంగ్మూల్యం చెప్పాలని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నాలుగు రోజుల క్రితం ఫోన్ రావడం నోటీసులు రావడంతో తాను తన అనుచరులు హాజరైనట్లు తెలిపారు.

ఫోన్ టాపింగ్ వ్యవహారం  పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో తన ఇంటి పైకి డిఎస్పీ ఆధ్వర్యంలో దాడులు, తనిఖీలు నిర్వహించి, తమ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు, ఆందోళన లకు గురిచేసారని తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు టిఆర్‌ఎస్ పార్టీ నుంచి తాను కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తన ఫోన్ ట్యాంపరింగ్ చేశారని అన్నారు. తనతో పాటు తన అనుచరుల ఫోన్ టాపింగ్ చేయడంపై మండిపడ్డారు. వ్యక్తిగత పైరసిని దెబ్బతీసే విధంగా ఫోన్ ట్యాంపరింగ్  చేయడం సరి కాదన్నారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ఆయనతోపాటు ఆయన అనుచరులు అశోక్, కరుణాకర్ రెడ్డి, అరవింద్ కుమార్ లు పాల్గొన్నారు.