17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

నా జీవిత భాగస్వామి సగం ఇండియన్

01-12-2025 01:41 AM

-ఆమె కుమారుల్లో ఒకరి పేరు శేఖర్

-‘భారతీయుల ప్రతిభకు ప్రధాన లబ్ధిదారుగా అమెరికా

-టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ 

న్యూఢిల్లీ, నవంబర్ 30: ‘నా భాగస్వామి(పాట్నర్) శివోన్ జిలిస్ సగం భారతీయురాలు’ అని టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ చెప్పారు. జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ‘డబ్ల్యూటీఎఫ్ ఈజ్?’ పాడ్‌కాస్ట్‌లో మస్క్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శివోన్ జిలిస్, తన కుమారులలో ఒకరి మధ్య పేరు శేఖర్ అని, దీనికి భారతీయ -అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పేరు పెట్టారని కూడా వెల్లడించారు. జిలిస్ ఎక్కడ పెరిగారని కామత్ అడిగినప్పుడు ఆమె పూర్వీకుల వివరాలను కూడా మస్క్ తెలిపారు.

ఆమె కెనడాలో పెరిగిందని మస్క్ చెప్పారు. ఆమె శిశువుగా ఉన్నప్పుడు ఆమెను దత్తత కోసం వదులుకున్నారని అన్నారు. ‘ఆమె తండ్రి విశ్వవి ద్యాలయంలో మార్పిడి విద్యార్థి లాంటివారని నేను అనుకుంటున్నా’ అని అని మస్క్ పేర్కొన్నారు. జిలిస్ 2017లో మస్క్ ఏఐ కంపెనీ, న్యూరాలింక్‌లో చేరారు. ప్రస్తుతం ఆపరేషన్స్, స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా ఆమె ఉన్నారు. ఆమెకు యేల్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్, ఫిలాసఫీలో బ్యాచిలర్ ఆఫ్ ఆరట్స్ ఉంది. జిలిస్‌కు నలుగురు పిల్లలు, కవలలు. స్ట్రైడర్, అజూర్, కుమార్తె ఆర్కాడియా, కుమారుడు సెల్డాన్ లైకుర్గస్ ఉన్నారు.

ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అమెరికా అపారమైన ప్రయోజనం పొందిందని ఆ మస్క్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘భారతదేశం నుంచి ప్రతిభకు అమె రికా అపారమైన లబ్ధిదారుగా ఉంది. కానీ ఇప్పుడు అది మారుతున్నట్లు కనిపిస్తోంది’ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం తీవ్రమవుతున్న యూఎస్ వీసా పరిమితులు, విధానపరమైన చర్యల నేపథ్యంలో వేలాది మంది భారతీయుల అమెరికన్ కల చెదిరిపోతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. 

రాబోయే 20 ఏళ్లలో పని ఐచ్ఛికమే!

-ఎలోన్ మస్క్ అంచనా

న్యూఢిల్లీ, నవంబర్ 30: ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్), రోబోటిక్స్ ముందుకు సాగితే, రాబోయే 20 ఏళ్లలోనే పని చేయడం ఐచ్ఛికం అవుతుంది. ప్రజలు కోరుకునే ఏవైనా వస్తువులు, సేవలను కలిగి ఉంటారు’ అని టెక్ బిలియనీర్ ఎలోన్ మస్క్ అంచనా వేశారు. భవిష్యత్‌లో ప్రజలు అస్సలు పని చేయనవసరం ఉండదని ఆయన అన్నారు. కృత్రిమ మేధస్సుతో రూపొందించిన రోబోటిక్స్ ఆ మార్పు తెస్తాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలను జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్ పాడ్‌కాస్ట్‌లో మస్క్ చేశారు.

‘ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు వాస్తవానికి పేదరికాన్ని నిర్మూలిస్తాయని, రోబోలు ప్రతి ఒక్కరినీ ధనవంతులుగా చేస్తాయని మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో మానవులకు డబ్బు కీలకం కాకుండా ఉంటుందన్నారు. ‘ఏఐ, రోబోటిక్స్ పురోగతి మనల్ని తప్పనిసరిగా పని చేయాల్సిన అవసరం లేని స్థాయికి తీసుకొస్తుంది. మీరు మీ తోటలో సొంతంగా కూరగాయలు పండింకోవచ్చు.

మీరు దుకాణానికి వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసుకోవచ్చు’ అని మస్క్ పేర్కొన్నారు. మస్క్ ఇలాంటి అంచనా వేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ సంవత్సరం నవంబర్ 19న జరిగిన యూఎస్ -సౌదీ పెట్టుబడి ఫోరంలో,  ఏఐ, రోబోలు చివరికి మానవులకు పనిని ఐచ్ఛికంగా మార్చడానికి అనుమతిస్తాయని, ఆ డబ్బు ‘అసంబద్ధం’ అవుతుందని, పేదరికం ఉనికిలో ఉండదని ఆయన అన్నారు.