నా కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది!
- జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ను పట్టించుకోలేదు..
టీడీపీ అధికారంలో ఉంటే 2020లోనే ప్రాజెక్ట్ పూర్తయ్యేది..
ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి కావాలంటే మరో నాలుగేళ్లు పడుతుంది..
ప్రాజెక్టు సందర్శన అనంతరం మీడియాతో ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): పోలవరం విషయంలో తన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని ఏపీం సీఎం చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. సంబంధింత అధికారులు ప్రత్యేకంగా స్పిల్ వే, డయాఫ్రం వాల్, కాఫర్ డ్యాం పనుల పురోగతిని సీఎంకు వివరించారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనులను చూస్తుం టే ఎంతో బాధ కలుగుతోందన్నారు. పోలవరాన్ని ఏపీకి జీవనా డిగా భావించామని. కానీ జగన్ ప్రభుత్వం ప్రాజెక్ట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, నిర్మాణం గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.
ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు రావొద్దనే 2014లో తాను సీఎంగా కేంద్రా న్ని ఒప్పించి తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయించానన్నారు. తమ ప్రభుత్వంలో దాదాపు 72శాతం పనులు పూర్తయ్యాయన్నారు. స్పిల్ వే ద్వారా దాదాపు 50 లక్షల క్యూసెక్కుల నీరు పారేలా నాడు డిజైన్ చేశామన్నారు. ప్రపంచంలో ఇలాంటి డిజైన్ ఒక్క చైనాలో మాత్ర మే ఉందన్నారు. 2019లో జగన్ సర్కారు రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఏజెన్సీతో పాటు సిబ్బందిని కూడా మార్చారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఉండదగని జగన్ మోహన్‌రెడ్డి సీఎం అయి, రాష్ట్రానికి శాపం గా మారారన్నారు.
ఇప్పుడు ప్రాజెక్టు రూ. 446 కోట్లతో ప్రాజెక్ట్ పరిధిలో మరమ్మతుల చేపట్టినా, బాగుపడుతుందన్న నమ్మ కం తనకు లేదన్నారు.ఒక్క డయాఫ్రం వాల్ కడితేనే దాదాపు రూ.900 కోట్లు అవుతుందన్నారు. గడిచిన ఐదేళ్లలో టీడీపీ అధికా రంలో ఉంటే, 2020 నాటికే ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాజె క్ట్ పూర్తి కావాలంటే మరో నాలుగేళ్ల సమ యం పడుతుందన్నారు. ప్రాజెక్ట్ పరిధిలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని అమలు చేయకు ండా, జగన్ ప్రభుత్వం మరింత క్లిష్టం గా మార్చిందని దుయ్యబట్టారు. 2014 లో సీఎంగా చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం పనులను సమీక్షించేవారు. అంతేకాదు, సోమవారాన్ని ‘పోల’వారంగా ఆయ న అభివర్ణించేవారు. తాజాగా ఆయన సోమవారమే ప్రాజెక్టును సందర్శించడం గమనార్హం.






