తిరుమల భక్తులకు తగినన్ని సౌకర్యాలు
- టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. సోమవారం ఆశ్వీరాదం, అన్న ప్రసా దం, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. భక్తులు సంతృప్తి పరిచేలా నాణ్యమైన ఆహారం, మెరుగైన పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలు అందించడం తమ ప్రాథమిక కర్తవ్యమని పేర్కొన్నారు. యాత్రీకులతో మాట్లాడినప్పు డు వారి సమస్యలు తనకు చెప్పారని వాటిని త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. దర్శనం, ఆన్‌లైన్ కోటా విడుదల, ఆలయానికి సంబంధించిన సేవా టికెట్లు, రిసెప్షన్ విభాగంలోని వసతులు, ఇంజినీరింగ్ పనులపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
అంతకు ముందు ముళ్లకుంట ప్రాం తంలోని కాటేజీలు, లడ్డూ కౌంటర్లను పరిశీలించి యాత్రీకులతో సమావేశమై సౌకర్యా లపై అవగాహన కల్పించారు. అనంతరం తరిగొండ వెగమాంబ అన్న ప్రసాదం కాంప్లెక్స్‌లో అన్న ప్రసాదం రుచి నాణ్యతను పరిశీలించి భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌విబిసి సీఈవో షణ్ముఖ్‌కుమార్, ఎఫ్‌ఏసీఏఓ బాలాజీ, డీఎల్‌ఓ వీర్రాజు, సీఈ నాగేశ్వరరావు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.






