calender_icon.png 20 August, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కొరత లేదు

20-08-2025 12:58:02 PM

  1. కాంగ్రెస్ నేతల మాటలను రైతులు నమ్మే పరిస్థితిలో లేరు.
  2. కేంద్రం నుంచి యూరియా వస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కోరతపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(N Ramchander Rao) కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతులకు కచ్ఛితంగా యూరియా లభిస్తోందని.. యూరియా కోరత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. కేంద్ర నుంచి రావాల్సిన యూరియాను(Urea Shortage) తాము ఇస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల మాటలను రైతులు  నమ్మే పరిస్థితిలో లేరని ఆయన వెల్లడించారు. అటు రాష్ట్రంలోని పలు జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే కాంగ్రెస్ నేత వీ.హన్మంతరావును ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా అనౌన్స్ చేయవచ్చు కదా? ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పుడు బండారు దత్తాత్రేయ బీసీ ఆయనకు ఉప రాష్ట్రపతి ఇవ్వాలని చెప్పి, ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి ఎలా ఇచ్చారని ఎద్దేవా చేశారు. బీజేపీ పార్టీకి బీసీలపై నిజమైన ప్రేమ ఉందన్న టీబీజేపీ అధ్యక్షుడు, తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంబీసీ అన్నారు.