8 July, 2026 | 1:17 AM

మెడిసిటీ ఆసుపత్రికి ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు

08-07-2026 12:19 AM

ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శివరామకృష్ణ

మేడ్చల్ అర్బన్ జూలై 7(విజయక్రాంతి):ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని ఘనపూర్ మెడిసిటీ  ఆసుపత్రి కి ఎన్ ఏ బి హెచ్ గుర్తింపు లభించింది.ఈ నేపథ్యంలో మెడిసిటీ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గన్ పూర్ లో నాణ్యమైన వైద్య సేవలను అందించే దిశగా మరో మైలురాయిని సాధించింది.ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శివరామకృష్ణ మాట్లాడుతూ నాణ్యతను పరీక్షించి సర్టిఫికెట్ అందించే ఎన్‌ఎబిహెచ్ గుర్తింపును మెడిసిటీ ఆసుపత్రి సాధించడం గర్వకారణంగా ఉందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రులలో ఇలా ఎన్.ఎ.బి.హెచ్ (NABH)గుర్తింపు సాధించిన అతికొద్ది సంస్థలలో మెడిసిటీ ఆసుపత్రి ఒకటిగా నిలి చిందని ఆయన పేర్కొన్నారు. మెడిసిటీ గ్రూ ప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ సీఈవో డాక్టర్ ఐనీష్ మర్చంట్ మాట్లాడుతూ వైద్య సేవలలో నాణ్యత అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియని తెలిపారు.నేడు మెడిసిటీ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కు చెందిన అనుబంధ మెడిసిటీ ఆస్పత్రికి ఎంఎబిహెచ్ అక్రిడిటేషన్ కోసం పట్టుదలతో పనిచేసి గుర్తింపు సాధించామని ఆయన వెల్లడించారు.

మెడిసిటీ ఆసుపత్రికి గత కొన్ని సంవత్సరాలుగా వైద్య సేవలలో నాణ్యతను పెంపొందించడానికి సమస్త చేస్తున్న కృషికి గుర్తింపు లభించడం నిదర్శనమన్నారు.ఇందుకు కొనసాగింపుగా ఇప్పుడు ఎన్.ఎ.బి.హెచ్ అక్రిడిటేషన్ గుర్తింపు కార్డును సాధించి మరో మారు తాను చేస్తున్న సేవలు నాణ్యతతో కూడి ఉన్నాయని స్పష్టమైందని యాజమాన్యం తెలిపారు.ఇప్పటికే మెడిసిటీ ఆసుపత్రిలో ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి తేచ్చామని భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వారు వెల్లడించారు.విలేకరుల సమావేశంలో ఆస్పత్రి ప్రిన్సిపాల్ దేవేంద్ర సింగ్ నేగి లతోపాటు మిగతా సిబ్బంది పాల్గొన్నారు.