15-08-2025 12:43:21 AM
డిచ్పల్లి, ఆగస్టు 14 (విజయ క్రాంతి): తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగాధిపతి డా.కె. వి. రమణాచారి పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థిని గోగునేని నాగజ్యోతి ‘ ఫ్యామిలీ మ్యారేజ్ , సొసైటీ ఇన్ ద సెలెక్ట్ నావెల్స్ ఆఫ్ మంజు కపూర్’ అనే అంశంపై పరిశోధన జరిపారు ఈ రోజు జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్సటర్నల్ ఎగ్జామినర్ గా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ దీపజ్యోతి ఆన్లైన్లో హాజరై పరిశోధన సిద్ధాంత గ్రంధాన్ని సమగ్రంగా మూల్యాంకనం చేసినారు.
పరిశోధక విద్యార్థి గోగినేని నాగజ్యోతి పరిశోధన ఇప్పుడున్న సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని దిని వల్ల దేశంలో జరిగే వివాహ వ్యవస్థ ప్రయోజనాలను ఈ సిద్ధాంత గ్రంథంలో తెలియజేయడం జరిగిందన్నారు. ఆచార్య దీపజ్యోతి గారు పరిశోధన అంశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసి పీహెచ్డీ డిగ్రీ ప్రధానానికి ఆమోదం తెలిపారు.ఈ బహిరంగ మౌఖిక పరీక్షకు ఆరట్స్ డీన్ ఆచార్య కే లావణ్య డాక్టర్ పి సమత , డాక్టర్ మహమ్మద్ జమీల్ అహ్మద్, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి కాంటాక్ట్ అధ్యాపకులు ఎల్.జోష్ణ, ఎన్ స్వామి మరియు పరిశోధక విద్యార్థిని విద్యార్థులు హాజరైనారు.ఈ పరిశోధనకు సహకరించిన తన కుటుంబ సభ్యులకు గోగినేని నాగజ్యోతి కృతజ్ఞతలు తెలిపారు.