10-07-2025 12:00:00 AM
చిలుకూరు, జూలై 9 : మాదిగ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షులుగా చిలు కూరు గ్రామానికి చెందిన మల్లేపంగు నాగరాజును ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు బుధవారం విలేకరులకు తెలిపారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ మాదిగ ఉద్యోగుల సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సూరిబాబు మాదిగ, ఎంఎస్పి మండల అధ్యక్షులు మాతంగి వీరస్వామి, మాతంగి మట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.