calender_icon.png 10 July, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోరీకి పాల్పడిన ఇరువురు నిందితులు అరెస్ట్

09-07-2025 11:39:22 PM

పెన్ పహాడ్: చోరీకి పాల్పడిన ఇరువురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ లో చోటుచేసుకుంది. డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని మహమ్మదాపురం గ్రామానికి చెందిన కంభంపాటి నాగేశ్వరరావు, సూర్యాపేట రూరల్ కు చెందిన మామిడి జనార్ధన్ ఇరువురు కలసి కారులో సూర్యాపేటకు వెళుతుండగా అనంతారం ఎక్స్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా కారులో బంగారం నగదు ఉండడంతో అనుమానంతో విచారణ చేపట్టారు.

విచారంలో భాగంగా ఈ ఇరువురి వ్యక్తులు పాత నేరస్తులు, ఇటీవల పెన్ పహాడ్ లో గుండపునేని వెంకట్రావు తాళం వేసిన ఇంటిని ఇటీవల ఈ ఇరువురు కలిసి తాళం పగలగొట్టి 4.7 తులాల బంగార ఆభరణాలు, దూపహాడ్ కు చెందిన పత్తిపాక సైదులు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న రెండు వేల రూపాయలు నగదును అపహరించినట్లు విచారణలో తేలినట్టు ఎస్సై తెలిపారు. ఈ మేరకు  వీరి వద్ద నుంచి బంగారు ఆభరణాలతో పాటు, రెండు సెల్ ఫోన్లు, ఒక్క కారు సీజ్ చేసి కేసు నమోదు కోర్టుకు రిమాండ్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు. కాగా స్థానిక ఎస్ఐ గోపికృష్ణ, తన సిబ్బంది కలసి చాకచక్యంగా నిందితులను పట్టుకోవడం జరిగింది.