calender_icon.png 10 July, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికిత్స పొందుతూ యువకుడి మృతి

10-07-2025 12:00:00 AM

మునిపల్లి, జులై 9 : పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామంలో బుధవారం నాడు చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి మునిపల్లె ఎస్త్స్ర రాజేష్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాటిపల్లి గ్రామానికి చెందిన గొల్ల విజయ్ కుమార్ (19) అనే యువకుడు సదాశిపేట మండలంలోని ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమలో కార్మికునిగా  పనిచేస్తున్నాడు.

ఈనెల 7వ తేదీన గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి వ్యవసాయ పొలానికి వెళ్లి చూడగా అప్పటికే విజయ్ పురుగుల మందు సేవించి ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం సికిందారాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు.

అక్కడ చికిత్స పొండుతూ బుధవారం మృతి చెందినట్టు ఎస్త్స్ర రాజేష్ నాయక్ తెలిపారు. మృతుని సోదరుడు గొల్ల కనకరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.