16 July, 2026 | 5:34 PM

నాగార్జున సాగ‌ర్ డ్యాం క్రస్ట్ గేట్ల మూసివేత..

03-08-2025 11:20 AM

నాగార్జున సాగ‌ర్ (విజయక్రాంతి): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు(Nagarjuna Sagar Project)కు వరద తగ్గుముఖం పట్టడంతో ఎన్నెస్పీ అధికారులు డ్యామ్‌ క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటి విడుదలను నిలుపుదల చేశారు. నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో భారీగా రావడంతో జులై 29న క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు. ఆదివారం ఉదయం 2 క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగించగా.. ఎగువ నుంచి వరద ఉధృతి తగ్గడంతో క్రస్ట్‌ గేట్లను క్రమంగా తగ్గిస్తూ ఆదివారం 11 గంటలకు పూర్తిగా నిలుపుదల చేశారు. వరద ఉధృతిని బట్టి క్రస్ట్‌ గేట్ల ద్వారా మళ్లీ నీటి విడుదల చేపడుతామని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్‌ పూర్తి నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 585.80 అడుగుల వద్ద ఉన్నది. అదే విధంగా గరిష్ఠ నీటినిల్వ 312.50 టీఎంసీలు కాగా, ఇప్పుడు 299. టీఎంసీలులు ఉంది.