calender_icon.png 3 August, 2025 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్వచర్ల ప్రజల కల నిజం చేశా

03-08-2025 11:40:11 AM

రోడ్డు వేశాకనే మీ ఊరికి వస్తా అన్న..

రెండు కోట్ల 60 లక్షలతో రోడ్డు పూర్తి చేసి గ్రామస్తుల కళ్ళలో ఆనందం చూశా..

కల్వచర్లలో ప్రధాన రహదారి సీసీ రోడ్డు ప్రారంభంలో మంత్రి శ్రీధర్ బాబు..

మంథని (విజయక్రాంతి): కల్వచర్ల ప్రజల కల నిజం చేశానని, మీ ఊరికి రోడ్డు వేశాక వస్తానని మాట ఇచ్చి, రెండు కోట్ల 60 లక్షలతో రోడ్డు పూర్తి చేశానని, ఇప్పుడు గ్రామస్తుల కళ్ళలో ఆనందం చు‍స్తున్ననాని రామగిరి మండలంలోని కల్వచర్లలో ప్రధాన రహదారి సీసీ రోడ్డు ప్రారంభోత్సంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. కల్వచర్ల ప్రధాన రహదారి నుంచి లొంక కేసారం వరకు దాదాపు రెండు కోట్ల 60 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించి గ్రామస్తుల కష్టాలు మంత్రి తీర్చారు.

గ్రామంలో సీసీ రోడ్డు పూర్తిగా గుంతల మయమై గ్రామస్తులు ప్రయాణించాలంటే జంకుతుండేవారని, మాజీ సర్పంచ్ రమణారెడ్డితో పాటు గ్రామస్తులు మా గ్రామానికి సీసీ రోడ్డు నిర్మించాలని ఎన్నికలలో తెలిపారని, నిధులు లేకున్నా ప్రముఖ కాంట్రాక్టర్ దేవేందర్ రెడ్డితో మాట్లాడి  నిధులు మంజూరు చేయిస్తానని తెలుపగా ఆయన రోడ్డు వేశాడని, గ్రామస్తుల కోరిక మేరకు ఈ రోడ్డు నిర్మించడం జరిగిందని శ్రీధర్ బాబు తెలిపారు. శ్రీధర్ బాబుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, జడ్పిటిసి,  గంట వెంకటరమణారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కనకయ్య యాదవ్, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, లొంక కేసారం మాజీ సర్పంచ్ మంజూర్ లతో పాటు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.