03-08-2025 11:16:26 AM
షిరిడి సాయి సేవాదళ్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్(Municipal Chairman Anand Goud) అన్నారు. జిల్లా కేంద్రంలో షిరిడి సాయి సేవాదళ్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 390 వారాల నుండి భజనలు చేయడం సేవా దృక్పథంతో ముందుకు సాగడం అభినందనీయమని, ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడంలోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. వేసవిలోనే కాకుండా నిరంతరం తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేసి ఎంతో మంది దాహాన్ని తీర్చడం అభినందనీయమని పేర్కొన్నారు. మానవత దృక్పథంతో ప్రతి ఒక్కరు సేవా మార్గంలో ప్రయాణించాలని సూచించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వినోద్, నరేష్, యాదయ్య, రాఘవేందర్, అరవింద్, మనోహర్, సాయి ప్రకాష్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.