29-07-2025 12:24:03 PM
హైదరాబాద్: నాగార్జునసాగర్ నుంచి మంత్రులు నీటిని విడుదల చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ క్రస్ట్ గేట్ల(Nagarjuna Sagar Dam Gates lifted) ఎత్తి నీరు విడుదల చేశారు. నాగార్జునసాగర్(Nagarjuna Sagar) జలాశయం 18 ఏళ్ల తర్వాత జులైలోనే నిండింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... సాగర్ నుంచి గేట్లు ఎత్తడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాగార్జునసాగర్ .. మనకు ఆధునిక దేవాలయం అన్నారు. సాగర్కునెహ్రు పునాది వేస్తే ఇందిరాగాంధీ ప్రారంభించారని గుర్తుచేశారు. 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే గొప్ప ప్రాజెక్టు ఇదని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.