calender_icon.png 30 July, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జున సాగర్‌ 14 గేట్లు ఎత్తివేత

29-07-2025 12:57:37 PM

  1. అవుట్ ఫ్లో 1లక్ష 18 వేల క్యూసెక్కులు దిగువకు
  2. ఇన్ ఫ్లో 2.28900 క్యూసెక్కుల నీటి విడుదల
  3. సాగర్ జలాశయం వద్ద పర్యాటకులు కేరింతలు 

నాగార్జునసాగర్, విజయక్రాంతి: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.. దీంతో దిగువనున్న ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో.. రెండు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. ఈ నేపథ్యంలో మంగళవారం నాగర్జున సాగర్ ప్రాజెక్ట్(Nagarjuna Sagar gates lifted) 14గేట్లను ఐదు ఫీట్ల మేరకు ఎత్తి దిగువకు నీటి విడుదల మంగళవారం ఎత్తివేశారు. 18 ఏళ్ల తర్వాత నాగర్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తారు. నాగార్జునసాగర్ గేట్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి భారీగా కొనసాగుతోంది.. ఇన్‌ఫ్లో 2‘28‘900 ఔట్‌ఫ్లో 1లక్ష 18 వేల క్యూసెక్కులు  ఉంది.. ప్రస్తుత నీటిమట్టం 586.40 అడుగులు ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.. 18 ఏళ్ల తర్వాత తొలిసారి జూలైలో క్రస్ట్ గేట్లు తెరుచునున్నాయి.

ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ తో పాటు పలు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు(312.04 టీఎంసీలు)కాగా,ప్రస్తుతం అది 586.60 అడుగులకు చేరుకుంది. గేట్లు ఎత్తిన దృష్ట్యా,ప్రాజెక్టు దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలతో సూచనలు జారీ అయ్యాయి. 18 సంవత్సరాల విరామం తర్వాత,ఈసారి నెల రోజుల ముందుగానే నాగార్జునసాగర్‌ నుంచి నీటిని విడుదల చేయడం విశేషం.

సాగర్ జలాశయం వద్ద పర్యాటకులు కేరింతలు 

నాగార్జునసాగర్ ప్రాజెక్టు(Nagarjuna Sagar) 14గేట్లను ఐదు ఫీట్ల మేరకు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నా అధికారులు మంగళవారం తెరిచారు. దీంతో ఆ ప్రాంతంలో పర్యాటకుల సందడి నెలకొంది. సాగర్ అందాలు చూడడానికి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సాగర్ జలాశయం గేట్ల ద్వారా విడుదలవుతున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కొందరు, స్నేహితులతో మరికొందరు ఇలా సాగర్ అందాలను వీక్షించేందుకు తరలివస్తున్నారు. 

ఒకవైపు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మరోవైపు సాగర్ జలాశయం వద్ద పర్యాటకులు కేరింతలు పెడుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా పర్యాటకులతో సందడిగా మారింది. వాతావరణం కూడా చల్లగా ఉండడంతో పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి సాగర్ కు చేరుకుంటున్నారు. జల సందడితో కూడిన సాగర్ డ్యాంను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని పలువురు పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. రేపు, ఎల్లుండి కూడా జలాశయం వద్ద రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.