07-01-2026 12:55:33 AM
భూ రికార్డుల్లో పేరు బదలాయింపునకు రూ.50వేలు డిమాండ్
కామారెడ్డి జిల్లాలో ఘటన
కామారెడ్డి, జనవరి 6 (విజయక్రాంతి): భూ రికార్డుల్లో పేరు బదలాయింపు కోసం డబ్బులు డిమాండ్ చేసిన తహసీల్దార్ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో మంగళవారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ కథనం ప్రకారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాసరావును మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు భూ రికార్డుల్లో పేరు బదలాయింపు కోసం ఆశ్రయించాడు. ఇందుకు తహసీల్దార్ రూ.50వేలు రైతును డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
పక్కా ప్రణాళిక ప్రకారం ఏసీబీ అధికారులు రైతుకు 50 వేల రూపాయల నోట్లను అందించారు. మంగళవారం నాగిరెడ్డిపేట తహసీల్దార్ కా ర్యాలయానికి చేరుకున్న ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీనివాసరావుకు డబ్బులు ఇచ్చేందుకు రాగా ఓ ప్రైవేట్ వ్యక్తి అజయ్‌కు డబ్బులు అప్పగించాలని తహాసిల్దార్ శ్రీనివాసరావు రైతుకు చెప్పాడు. దీంతో రైతు ప్రైవేటు వ్యక్తికి డబ్బులు చెల్లిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండె డ్‌గా పట్టుకున్నారు.
ప్రైవేటు వ్యక్తిని విచారించగా తహసీల్దార్ శ్రీనివాసరావు డబ్బులు తీసుకోమనీ చెప్పినట్లు ఏసీబీ అధికారులకు ప్రైవేట్ వ్యక్తి వివరించారు. దీంతో తహసిల్దార్ శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొ ని ప్రైవేటు వ్యక్తి వద్ద నుంచి రూ. 50 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. తహసీలార్ శ్రీనివాసరావుతో పాటు ప్రైవేట్ వ్యక్తి అజయ్‌ని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు.