07-01-2026 12:57:27 AM
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
ముషీరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): మాలల పక్షాన రాష్ట్ర అసెంబ్లీలో గళం విప్పడం హర్షనీయమని తెలంగాణ మాల సంఘాల జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే నాగరాజును కలిసి శాలువా కప్పి బొకే అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, గౌరవ చైర్మన్ చెరుకు రామచందర్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బీర బాలకిషన్ లు మాట్లాడుతూ వర్ధన్నపేట ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ఉన్న మాలల పక్షాన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తమ గళం అభినం దనీయమన్నారు.
తెలంగాణలో అనాధిగా వెనుకబడి ఉన్న, అణగతొక్కబడి ఉన్నా మాల సమాజానికి జరుగుతున్న అన్యాయం మీద మొట్టమొదటిసారిగా తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీలలోని 58 కులాలకు జరుగుతున్న అన్యాయం మీద గలమెత్తిన ఏకైక ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు అని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మాలల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ నేతలు మాదాసు రాహుల్ రావు, నాలుకల నరసింహరావు, లాకుమల్ల మనోజ్ కుమార్, మొగ్గుల్లా మల్లేష్, కొప్పుల అర్జున్ తదితరులు పాల్గొన్నారు.