calender_icon.png 18 January, 2026 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యచంద్రులు ఉన్నన్నాళ్లు ఎన్టీఆర్ ఆరాధ్య దైవమే

18-01-2026 11:57:41 AM

హైదరాబాద్: దివంగత నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30వ వర్థంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), నందమూరి రామకృష్ణ, సుహాసిని, నారా భువనేశ్వరి, పురందేశ్వరి, నారా లోకేష్, కల్యాణ్ రామ్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... మహానుభావులు కావాలంటే ఎంతో శ్రమ, దీక్ష ఉండాలని తెలిపారు. టీడీపీని స్థాపించి ఎన్టీఆర్ సంచలనం సృష్టించారని కొనియాడారు. సూర్య చంద్రులు ఉన్నన్నాళ్లు ఎన్టీఆర్ బతికే ఉంటారని, తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఆరాధ్యదైవమేనని బాలయ్య పేర్కొన్నారు. తెలుగు అనే మూడు అక్షరాలు వింటే తన ఒళ్లు పులకరిస్తుంది... అలాగే ఎన్టీఆర్(Nandamuri Taraka Rama Rao) అనే మూడు అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతోందని  బాలకృష్ణ వివరించారు.