18-01-2026 01:02:12 PM
వర్ధంతి సభలో నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్లు..
ఆదిలాబాద్,(విజయక్రాంతి): పటేల్, పట్వారి వ్యవస్థను రద్దుచేసి, మహిళలకు సమాన హక్కును కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్ అని టీడీపీ పార్టీ జిల్లా నాయకులు అల్లూరి రాజా రెడ్డి అన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ లోని ఎన్టీఆర్ చౌక్ లో ఆ మహనీయుని విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ.. రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదవారికి కూడు, గూడు, నీడ అనే నినాదంతో అధికారం చేపట్టి తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడ్డ మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. బీసీల రాజ్యాధికారం కోసం ఎంతో తపించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగసరపు ఓమన్న, గాలిపెల్లి నాగన్న, కాడే రాములు, నూనె సతీష్, సోమా గంగారెడ్డి, ఆకుల రాము, అంబుబాయ్, నిరటి పెంటన్న, సరస్వతి, అక్తర్ బాయ్, అశోక్ మొరకోండి తదితరులు పాల్గొన్నారు,