calender_icon.png 18 January, 2026 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి?

18-01-2026 12:37:52 PM

పాలమూరు జిల్లాకు సీఎం న్యాయం చేయాలి.

జూరాల వద్ద సరిపడా నీటి లభ్యత లేదు.

హైదరాబాద్: జూరాల వద్ద సరిపడా నీటిలభ్యత లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) ఆదివారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. డిసెంబర్ నెలలోనే జూరాలలో చుక్కనీరు కనపడదని వెల్లడించారు. శ్రీశైలం నుంచి అయితే... వేసవిలో కూడా నీరు తీసుకోవద్దని వెల్లడించారు. బీజేపీ నేతలు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు(Palamuru-Rangareddy Project) జాతీయహోదా తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ రెండేళ్లలో పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. 90 టీఎంసీల ప్రాజెక్టును 45 టీఎంసీలకు తగ్గించాలని కేంద్రం చేస్తోందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ నిర్మించిన వాటికి ఈ సీఎం శంకుస్థాపనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ వాటా జలాలు ఏపీకి ఇవ్వకుండా పాలమూరు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.