calender_icon.png 18 January, 2026 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ

18-01-2026 01:04:01 PM

ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు

బెజ్జూర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని గాంధీనగర్ వార్డులో 11 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వార్డు సభ్యులతో మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని తెలిపారు. యుద్ధ ప్రాతిపదన ఇండ్లకు ముగ్గు పోసుకొని పనులు మొదలు పెట్టాలని తెలిపారు. వార్డులో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని వార్డు ప్రజలు తెలియజేయడంతో 100 మీటర్ల నూతన డ్రైనేజీని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అదే వార్డులో నివాసం ఉండి ఇటీవల మరణించిన సుద్దమల్ల రాజయ్య కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందని అన్నారు.