18-01-2026 01:39:38 PM
ఇండోర్ వేదికగా భారత్, న్యూజిలాండ్(India vs New Zealand 3rd ODI) మధ్య మూడో వన్డే జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్-న్యూజిలాండ్ మధ్య నిర్ణయాత్మక మూడో వన్డేలో ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో తుది జట్టులోకి అర్ష్‌దీప్ సింగ్ ను తీసుకున్నారు. మూడు వన్డేల సిరీస్ లో భారత్-న్యూజిలాండ్ చెరో మ్యాచ్ గెలిచాయి. చివరి మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.