18-01-2026 11:01:25 AM
తుంగతుర్తి,(విజయక్రాంతి): విధుల నిర్వహణలో భాగంగా నల్గొండ నుండి తుంగతుర్తి మండలానికి విచ్చేయుచున్న ప్రధానోపాధ్యాయు రాలు గీతారెడ్డి కస్తూర్బా గాంధీ బాలికల ఎస్ఓ కల్పన జాజిరెడ్డిగూడెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇరువురు ఉపాధ్యాయురాలు మృతి చెందారు. దీనితో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఆదివారం ఉదయం నల్గొండలో వారి కుటుంబాలను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ బోధనా అందిస్తున్న ఇరువురు ఉపాధ్యాయురాలు ఒకే సంఘటన లో మృతి చెందిన బాధాకర విషయం అని, గాయాలకు గురైన తుంగతుర్తి హెడ్మాస్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారం హెడ్మాస్టర్ సుధారాణిలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. జరిగిన సంఘటనపై పోలీసు అధికారులు విచారణ జరిపించాలని అన్నారు.