calender_icon.png 19 December, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్నూరు కాపు సంఘానికి నరసయ్య సేవలు ప్రశంసనీయం

19-12-2025 05:38:44 PM

రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పురుషోత్తమరావు

చిలుకూరు: చిలుకూరు బీఆర్ఎస్ నాయకులు, కస్తూరి నర్సయ్య మున్నూరు కాపు సంఘానికి చేసిన సేవలు ప్రశంసనీయమని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తమరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల రామారావు, రాష్ట్ర కార్యదర్శి ఇందూరు తిరుపతి కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ కుటుంబంలో జన్మించి అనేక వామపక్ష ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర వహించారన్నారు. తొలి, మలిదశ తెలంగాణఉద్యమాలలో పాల్గొని, ప్రజల ఆకాంక్ష మేరకు కెసిఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ సాధనలో తన పాత్ర నిర్వహించారన్నారు.

ఆయన రాజకీయంగానే కాకుండా ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగి అన్ని రాజకీయ పక్షాలతో సామరస్యభావంతో ముందుకు సాగారన్నారు. నరసయ్య అకాల మృతి పట్ల ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ మున్నూరు కాపు సంఘ నాయకులు జాబి శెట్టి చంద్రమౌళి, పాలేటి రామారావు, కోలా ఉపేందర్ రావు, బండ్లకోటయ్య, ఏనుగుల వీరాంజనేయులు, పొట్ట జగన్మోహన్రావు, సన్నీరు మురళి, పి గంగాధర్, గంటం రవి, కస్తూరి సైదులు, అంజయ్య, రాములు, సత్యనారాయణ, నాగేశ్వరరావు, భద్రం రాజు పిచ్చయ్య, వెలగొండ బిక్షమయ్య, సత్యం, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.