కాళీయ మర్దనుడిగా నారసింహుడు
యాదగిరిగుట్టలో కొనసాగుతున్న జయంతి ఉత్సవాలు
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 27(విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వా మి దివ్య క్షేత్రంలో వార్షిక జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తు న్నారు. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు సోమవారం ఉదయం స్వామివారి ఆలయ ఆస్ధాన మంటపములో లక్షపుష్పార్చనను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
స్వామి వారి అలంకార సేవతో పురవీధుల్లో ఊరేగింపు.. యజ్గశాలలో నృసింహ మహాల క్మీ మూలమంత్ర హవనాలు, సుదర్శనశతకహవనం పారాయణీక పండితులచే మూల మంత్ర జపాలు, పూర్ణాహుతి నిర్వహించా రు. సాయంత్రం కాళీయమర్ధన అలంకరణలో లక్ష్మీ నరసింహ స్వామివారు మాడవీ ధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకల్లో ఆలయ కార్య నిర్వహణ అధికారి భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, పండితులు ఆల య అధికారులు భక్తులు పాల్గొన్నారు.






