28 April, 2026 | 3:29 AM

30న నరసింహ జయంతి మహోత్సవం

28-04-2026 01:55 AM

హరేకృష్ణ గోల్డెన్ టెంపులో చురుగ్గా ఏర్పాట్లు

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో ఈ నెల 30న శ్రీనరసింహ జయంతి వే డుకలు వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ నరసింహ జయంతి శ్రీనరసింహ చతుర్దశి అని కూ డా పిలువబడే ఈపర్వదినం.

భగవంతుడైన శ్రీనరసింహుడు తన మహాభక్తుడైన ప్రహ్లాదుడిని రాక్షసరాజు హిరణ్యకశిపుని నుంచి రక్షిం చుటకోసం స్తంభంలోనుంచి అవతరించిన దివ్య ప్రత్యక్ష దినోత్సవాన్ని సూచించే ఒకముఖ్యమైన వార్షిక ఉత్సవం. బంజారాహిల్స్‌లోని ప్రశాంతమైన కొండపై వెలసిన హరేకృష ్ణగోల్డెన్ టెంపుల్, నగరంలోని ప్రాచీన శ్రీలక్ష్మీనర సింహస్వామి దేవాలయాల్లో ఒకటి. ఇక్కడి ప్రధాన విగ్రహమైన శ్రీలక్ష్మీనరసింహస్వామివారు పవిత్ర స్వయంవ్యక్త (స్వయంభూ) దేవతగా ఉద్భవశిలపై ప్రత్యక్షమై, లక్ష్మీదేవితోకూడిన అరుదైన నిలువెత్తు భంగిమలోదర్శన మిస్తారు. ఈ దేవతను క్రీస్తుశకం 8వశతాబ్దం నుంచేఆరాధిస్తున్నారని విశ్వసించబడుతోంది.

రాబోయే శ్రీనరసింహజయంతి వేడుకలగురించి హరేకృష్ణ మూమెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌరచంద్రదాస ప్రభుజీ (ఎంటెక్, ఐఐటీచెన్నై) మాట్లాడుతూ ఈ నెల 30న హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ శ్రీ నరసింహ జ యంతి వేడుకలను జరుపుకోవడం మాకుఎంతో ఆనందంగాఉంది. భక్తులు వివిధ పవిత్ర కార్యక్రమా ల్లో పాల్గొని శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆశీర్వాదాలను పొందగలరు. ఆలయానికి విచ్చేసే ప్రతిఒక్కరికీ ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించే విధంగా విస్తృత ఏర్పాట్లు చేశామని తెలిపారు.

30న ఉదయం 5 గంటలకు స్వామివారి మూల విరాట్‌కు కలశ మహాభిషేకం, ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు లక్ష్మీ నరసింహస్వామివారి విశేష అలంకార దర్శనం, 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వామికి ఝాలన్సేవ, ఉదయం 9.15 నుంచి 10 గంటల వరకు నరసింహ హోమం, 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు భూసమేత నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం, మధ్యాహ్నం 12.3 0 నుంచి 1.30 గంటల వరకు అన్నప్రసాదం, సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు స్వామివారి ఉత్సవ విగ్రహానికి 108 కలశాలతో మహాభిషేకం నిర్వహిస్తారు.   భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.