12-05-2025 01:04:29 AM
రాజేంద్రనగర్, మే 11: నరసింహ స్వా మి జయంతి సందర్భంగా ఆదివారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివి జన్ తేజస్విని కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ పండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.