12-05-2025 01:06:19 AM
ముషీరాబాద్, మే 11 (విజయక్రాంతి) : మాతృదినోత్సవాన్ని పురస్కరించుకోని పద్మశాలి కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం పద్మశాలి కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి కాలనీ వెల్ఫేర్ సొసైటీ మహిళా కమిటీ ప్రతినిధులు సుజాత, ఉమాదేవిల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా సుజాత, ఉమాదేవిలు మాట్లాడు తూ... సకల జగత్తుకు జీవనాధారం అమ్మ అని ప్రతి ఒక్కరూ తల్లిపై ప్రేమ చూపుతూ వారిని ఆదరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు స్వప్న, శ్రీవాణి, లావణ్య, దీప, అమూల్య తదితరులు పాల్గొన్నారు.