జేఈఈ మెయిన్‌లో ‘నారాయణ’ హవా
ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్ సెషన్ ఫలితాల్లో నారాయణ కాలేజీ సత్తా చాటింది. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 1, 5, 6, 7, 8, 10 ర్యాంకులతో విజయకేతనం ఎగురవేసింది. 12లోపు 7 ర్యాంకులతో ప్రభంజనం సృష్టించింది. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో జీ నీల్‌కృష్ణ మొదటి ర్యాంకు, హెచ్ విదిత్ 5, ఎం అనూప్ 6, ఎం సాయితేజ 7, సీహెచ్ సతీష్‌కుమార్ 8, ఆర్యన్ ప్రకాష్ 10, పీ రోహన్‌సాయి 12వ ర్యాంకు సాధించారు. వీటితో పాటు 17, 24, 28, 34, 39, 47, 62, 64, 66, 69, 78, 82, 84, 88 వంటి 28 టాప్ ర్యాంకులను, వెయ్యిలోపు 171 ర్యాంకులను సాధించినట్లు నారాయణ గ్రూపు డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణినారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులు పోటీపడిన ఈ పరీక్షల్లో నారాయణ విద్యార్థులు విజయదుందుభి మోగించారని పేర్కొన్నారు.






