15-06-2025 01:39:22 AM
- తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంక్, ఆల్ కేటగిరీలో టాప్ 10 లోపు 8 ర్యాంకులు
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): నీట్ ఫలితాల్లో ఆల్ కేటగిరీలలో నారాయణ విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో మృణాల్ కిషోర్ ఝా (హెచ్.టి.నెం: 2313103182) 4వ ర్యాంక్, కేశవ్ మిట్టల్ (హెచ్.టి.నెం: 250410409767) 7వ ర్యాంక్, సౌమ్యశర్మ (హెచ్.టి.నెం: 250410231562) 14వ ర్యాంక్, కె. జీవన్ సాయి కుమార్ (హెచ్.టి.నెం : 25041 0773906) 18వ ర్యాంక్, రూపయన్ పాల్ (హెచ్.టి.నెం: 250410013768) 20వ ర్యాంక్ తో సంచలన విజయం అందుకున్నారు.
వీటితో పాటు 35, 47, 49, 59, 66, 70, 71, 73, 75, 77, 80, 87, 93, 94, 95 వంటి 100 లోపు 22 ర్యాంకులు, 1000 లోపు 85 ర్యాంకులు నారాయణ విద్యార్థులు కైవశం చేసుకున్నారు. అలాగే ఆలిండియా అన్ని కేటగిరీల్లో 1, 2, 3, 3, 4, 4, 7, 10 వంటి 10 లోపు 8 ర్యాంకులు, 100 లోపు 65 ర్యాంకులు, 1000 లోపు 216 ర్యాంకులు సాధింపజేసి సరికొత్త రికార్డు నెలకొల్పి ఆలిండియా అగ్రగామిగా నిలిచిందని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్స్ డాక్టర్ పీ సింధూరనారాయణ, పి శరణినారాయణ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంకు సాధించటం తెలుగు వారికి ఎంతో గర్వకారణమన్నారు. విశిష్టమైన ప్రణాళికలతో రూపొందించిన స్టార్ సిఓ బ్యాచ్, ఎన్-40 ప్రోగ్రామ్‌ల ద్వారా మాత్రమే టాప్ ర్యాంకుల సాధన నిరంతరాయంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా చేసుకుని నిర్వహించబడుతున్న నీట్ పరీక్ష కోసం అత్యంత వినూత్న విద్యాప్రణాళిక వలనే ఈ టాప్ ర్యాంకులు సాధించగలిగామని తెలిపారు.
ఇంతటి ఘనవిజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి నారాయణ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీత్ కొత్తప అభినందనలు తెలియజేశారు.