గంజాయి నిర్మూల లక్ష్యంగా నార్కోటి డాగ్ 'రోలెక్స్' తనిఖీలు
01-06-2026 08:52 PM
పట్టణ ఇన్స్పెక్టర్ శివ శంకర్
కోదాడ: జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది సోమవారం కోదాడ పట్టణ కేంద్రంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు అని పట్టణ ఇన్స్పెక్టర్ శివ శంకర్ తెలిపారు. పట్టణంలో గాంజా లాంటి మాదకద్రవ్యాల నిర్మూలన, గుర్తింపు లక్ష్యంగా నార్కోటిక్ డాగ్ రోలెక్స్ తో కోదాడ పట్టణ కేంద్రంలో బస్టాండ్, హోటల్స్, టీ దుకాణాలు, మెడికల్ దుకాణాలు, కూరగాయల దుకాణాలు, మద్యం దుకాణాలు, బహిరంగ ప్రదేశాలలో తనిఖీలు, సోదాలు నిర్వహించడం జరిగినదన్నారు. ఎవరైనా గంజాయి ఉపయోగించేవారు ఉన్నా సరఫరా చేసేవారు ఉన్నా అలాంటి వారి సమాచారం పోలీసులకు తెలియజేయాలని కోరారు. గంజాయి రహిత కోదాడ పట్టణంగా నిర్మించడంలో ప్రతి ఒక్కరు తమ వంతుగా కృషి చేయాలని కోరారు.






