ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
01-06-2026 08:48 PM
చేగుంట,(విజయక్రాంతి): మాసాయిపేట మండల కేంద్రంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సుడిగాలి పర్యటన నిర్వహించారు, మండలంలో నూతనంగా ఎన్నికైన ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు, అనంతరం పట్టణ కేంద్రంలో నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సర్పంచ్ ల ఫోరం మాజీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మాసాయిపేట సర్పంచ్ వీరన్న కృష్ణారెడ్డి, వివిధ గ్రామల సర్పంచ్ లు,బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల అధికారులు పాల్గొన్నారు.






