జూన్ 4 తర్వాత జూమ్ స్టాక్ మార్కెట్‌పై నరేంద్రమోదీ వ్యాఖ్యలు
20-05-2024 12:33 AM
న్యూఢిల్లీ, మే 19: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న జూన్ 4 తర్వాత ఫైనాన్షియల్ మార్కెట్లు కొత్త రికార్డులు నెలకొల్పుతాయంటూ ప్రధాని నరేంద్రమోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్డీటీవీలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పదేండ్లుగా ప్ర భుత్వం పలు ఆర్థిక సంస్కరణలు చేపట్టిందని, వాణిజ్య అనుకూల విధానాలను కేంద్రం ప్రవేశపెట్టిందన్నారు. ఇటీవలికాలంలో పలు ప్రభుత్వ రంగ సంస్థల షేర్లు పెరగడాన్ని ఆయన ఉదహరిస్తూ భారీ లాభాలు ఆర్జించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ స్టాక్ మార్కెట్లో అద్భుత ప్రదర్శన జరిపిందన్నారు. యువత ఇన్వెస్టర్లు అవుతున్నారని, ఇది మార్కెట్‌కు ప్రయోజనకరమని చెప్పారు.






