28 June, 2026 | 2:13 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

వ్యాయామశాల హనుమాన్ ఆలయ అధ్యక్షుడిగా నార్ల సురేష్

03-03-2026 12:00 AM

బాన్సువాడ, మార్చి 2 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని వ్యాయామశాల హనుమాన్ మందిర ఆలయ అధ్యక్షునిగా మాజీ ఏఎంసీ చైర్మన్ నార్ల సురేష్ ను ఎండోమెంట్ అధికారులు ప్రకటించడం జరిగింది. గతంలో నార్ల సురేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమకారుడిగా రైతుల సంక్షేమం కోసం పాటుపడడం జరిగింది.

సభ్యులుగా విద్యాసాగర్ నార్ల ఉదయ్ కొక్కెర శారద దాసరి శ్రీనివాస్ లను సభ్యులుగా నియమించడం జరిగింది. వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిల సహకారంతో ఆలయ అధ్యక్షునిగా నియమించినందుకు నార్ల సురేష్ తో పాటు సభ్యులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.