26-05-2025 12:37:33 AM
- కిలోమీటర్ల పొడవునా కుదరని ఓవర్టేక్
-పెరిగిన రాకపోకల రద్దీతో సమస్యలు
- జిల్లా కేంద్రాల మధ్యగల రాష్ట్రీయ రహదారి దుస్థితి
జగిత్యాల, మే 25 (విజయక్రాంతి): రెం డు ముఖ్యమైన జిల్లా కేంద్రాల మధ్య ఉన్న రాష్ట్రీయ రహదారి ఇది.. రాష్ట్ర రాజధానికి వె ళ్లాలన్నా తప్పకుండా ఈ రోడ్డుపై వెళ్లాల్సిందే మరి.. వ్యాపార, వాణిజ్యాల నిమిత్తం రైల్వే జంక్షన్ చేరుకోవాలన్నా ఈ రోడ్డు తప్పనిసరి... జగిత్యాల నుండి కరీంనగర్ వెళ్లే రాష్ట్రీ య రహదారిపై ప్రయాణించాలంటేనే ఈ ప్రాంత వాసులు బెంబేలెత్తుతున్నారు.
ఒకప్పటి ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్ నుం డి జగిత్యాల జిల్లా కేంద్రానికి ఉన్న ప్రధాన రహదారి పెరిగిన వాహనాల రాకపోకల రద్దీ తో ’ఇరుకైంది’గా మారింది. ఈ రోడ్డుపై ప్ర యాణించే వాహనదారులు తమ ముందు న్న వాహనాన్ని ఓవర్టేక్ చేయడానికి కిలోమీటర్ల పొడవునా వెంటాడి, వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ రహదారి వెం ట వెళ్లే వాహనాల వరుసను చూస్తే ఒక్కోసారి ర్యాలీని తలపిస్తాయి. జగిత్యాల జిల్లా లోని ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రజలు తమ ఉద్యోగ, వ్యాపార పనుల నిమి త్తం ప్రతిరోజూ జగిత్యాల - కరీంనగర్ రహదారిపై ప్రయాణిస్తుంటారు.
అలాగే జగిత్యా ల ప్రాంత ప్రజలు మన రాష్ట్ర రాజధాని హై దరాబాదుకు వెళ్లాలన్నా ఈ రోడ్డుపైనే ప్ర యాణించాలి. అంతేకాక ఈ ప్రాంత వా సు లు వరంగల్ జిల్లాకు వెళ్లాలన్నా కరీంనగర్ మీదుగా ప్రయాణించాల్సిందే మరి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు వె ళ్లాలనుకున్నా ఈ కరీంనగర్ రోడ్డే దిక్కు. వ్యా పార, వాణిజ్య కార్య కలాపాల నిమిత్తం కాజీపేట రైల్వే జంక్షన్ వెళ్లాలన్నా ఈ రోడ్డే గతి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతా ల నుండి తీస్తున్న ’గ్రానైట్’ ఇతర రాష్ట్రాలకు తరలించేది కూడా ఈ రహదారి మీదుగానే. అంతెందుకు పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సైతం తమ అవసరాల నిమిత్తం ఈ రోడ్డుపైనే ప్రయాణిస్తారు మరి.
ఇంతటి తీవ్ర వాహన రాకపోకల ప్రాము ఖ్యం, ప్రాతినిధ్యం ఉన్న జగిత్యాల - కరీంనగర్ రహదారి అభివృద్ధికి మాత్రం నోచుకో వడం లేదు. దశాబ్దాల తరబడిగా ఈ ప్రాంత ప్రజలు ఇరుకైన ఈ రహదారి మూలంగా ఎంతగా ఇబ్బంది పడుతున్నా ఎవరికీ పట్టకపోవడం బాధాకరం.
ఎందరో రాష్ట్ర మం త్రులు.. మరెందరో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు.. మారినప్పటికీ జగిత్యా ల -కరీంనగర్ రహదారి మాత్రం అభివృద్ధి కాకపోవడం విడ్డూరం. ఇప్పటికైనా సంబంధిత శాఖల ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు సానుకూలంగా స్పందించి జగిత్యాల, కరీంనగర్ జిల్లా కేంద్రాల మధ్యగల ఈ ప్రధాన రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
ప్రయాణం గగనంగా మారింది
చిన్నపాటి అత్యవసర ప్రయాణానికి సైతం చాలా సమయం పడుతున్నది. ఇరుకై న ఈరోడ్డుపై ప్రయాణం గగనంగా మా రింది. జగిత్యాల - కరీంనగర్ రహదా రి అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ఏసీఎస్ రాజు, మాజీ కౌన్సిలర్, జగిత్యాల
రోడ్డు విస్తరణ వెంటనే చేపట్టాలి
ప్రతిరోజు వేలాది వాహనాలు తిరిగే ఈ బీజీ రోడ్డుపై నిర్లక్ష్యం తగదు. జగిత్యాల నుండి కరీంనగర్ కారులో వెళ్లడం కంటే, బస్సులో వెళ్లడమే నయమనిపిస్తుంది. యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్డు విస్తరణ పనులుచేపట్టాలి
బాలె నరసయ్య, ప్రసాద్ సెలక్షన్స్, కోరుట్ల.