calender_icon.png 26 May, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులను అభినందించిన యెర్రా కామేష్

26-05-2025 12:36:18 AM

కొత్తగూడెం, మే 25 (విజయక్రాంతి)  మంచిర్యాలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో సీనియర్ బాక్సర్,కోచ్ దు ర్గేష్ శిక్షణలో జూనియర్ బాలికల విభాగం లో గోల్ మెడల్ సాదించి,జూన్ నెల 4,5, 6,7వ తేదీలో జరిగే జాతీయ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన పి.కావ్య,సిల్వర్ మెడల్ సాదిం చిన సుప్రియ లను జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అభినందించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక,పోటీ సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడటం అభినందనీయమన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన వారు జాతీయ స్థాయిలో కూడా రాణించి అంతర్జాతీయ పో టీలకు ఎంపిక కావాలని తద్వారా రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.