23 May, 2026 | 3:17 AM

ఏసీబీకి చిక్కిన నర్సాపూర్ ఏడీఈ

23-05-2026 01:58 AM

30 వేలు డిమాండ్ చేసిన ట్రాన్స్‌కో ఉద్యోగి

మెదక్, మే 22(విజయక్రాంతి): కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ట్రాన్స్ కో ఏడీఈ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ కె.సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం 2023 నుంచి 2025 వరకు ఓ కాంట్రాక్టర్ 11 ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన 3 లక్షల 15 వేల పనులు పూర్తి చేశారు. వీటి బిల్లులు ఫార్వర్డ్ చేసేందుకు సదరు కాంట్రాక్టర్‌ను నర్సాపూర్ ఏడీఈ రమణారెడ్డి 30వేలు లంచం డిమాండ్ చేశారు.

ఈ విషయంపై ఈనెల 20న కాంట్రాక్టర్ మెదక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి కాంట్రాక్టర్‌ను ఏడీఈ వద్దకు పంపగా రూ. 20వేలు లేదా రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కాంట్రాక్టర్ నుంచి ఏడీఈ రమణారెడ్డి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఇంకా ఇలాంటి అవినీతికి పాల్పడ్డాడని అనుమానంతో అతని ఇంటిని గాలించారు.

ఏడీఈ రమణారెడ్డిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని ఏసీబీ డీఎస్పీ   సుదర్శన్ వెల్లడించారు.ఎక్కడైనా అధికారులు లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని సూచించారు. ఈ దాడుల్లో ఇన్‌స్పెక్టర్లు వెంకటేష్, రమేష్ సిబ్బంది పాల్గొన్నారు.