23 May, 2026 | 2:51 AM

రోల్ మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషిచేయాలి

23-05-2026 01:57 AM
  1. కలెక్టర్ అంకిత్
  2. అధికారుల  ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే ప్రజా పాలన విజయవంతం : కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు
  3. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందాలి : పినపాక శాసనసభ్యులు  పాయం వెంకటేశ్వర్లు
  4. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి : ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య

భద్రాద్రి కొత్తగూడెం, మే 22 ,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం క్లబ్లో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. . ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు.

కార్యక్రమం ప్రారంభ దశలో జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామాలు, వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, సంక్షేమ వారోత్సవాలు, ఆరోగ్య శిబిరాలు విస్తృత స్థాయిలో చేపట్టినట్లు తెలిపారు. గ్రామపంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నాయని అన్నారు .

అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమిష్టిగా పని చేస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను రోల్ మోడల్ జిల్లాగా తీర్చిదిద్దవచ్చన్నారు.  కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేసే గొప్ప కార్యక్రమమన్నారు. ఏ ప్రభుత్వం అయినా తమ విధానాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అంకితభావంతో పని చేస్తే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు .ప్రతి శాఖ తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు.

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. మహాలక్ష్మి పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.

అయితే ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పని చేయాలని సూచించారు.  కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్  మేయర్ మూడ్ గణేష్ , డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, సబ్ కలెక్టర్ విద్యా చందన,కొత్తగూడెం ఆర్టిఓ మధు తదితరులు పాల్గొన్నారు.