28 May, 2026 | 12:24 PM

జాతీయ పక్షికి గాయం...ఫారెస్ట్ అధికారులకు అప్పగింత

28-05-2026 11:53 AM

షాద్ నగర్ మే 28 (విజయక్రాంతి): మూగజీవాల పట్ల కూడా జాలి కరుణ దయ ఉండాలని, మూగజీవాలను  సంరక్షించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని, వన్యప్రాణుల తరాలు అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన గురుతరమైన బాధ్యత మనదేనని న్యాయవాది చీపిరి చంద్రశేఖర్ యాదవ్ నిరూపించారు. తన వ్యవసాయ పొలంలో గాయపడి లేవలేని స్థితిలో ఉన్న మన జాతీయ పక్షి నెమలిని ఆయన తన అక్కున చేర్చుకుని ఫారెస్ట్ అధికారులను పిలిపించి  వారికి అప్పగించాడు. ప్రతి ఒక్కరు కూడా తమ వ్యవసాయ పొలాల వద్ద ఏవైనా వన్యప్రాణులు గాయపడి ఉంటే వాటిని అలాగే వదిలి వేయకుండా చికిత్స నైనా జరిపించాలి లేదా ఫారెస్ట్ అధికారులకైనా అప్పగించాలని కోరుతున్నారు.