ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్‌డే
02-07-2025 12:06 AM
అయిజ, జూలై 1 : ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయుట వలన ఎలాంటి హానికరం జరగదని, దీనివల్ల ఒకరి ప్రాణాలను కాపాడిన వారు అవుతారని జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ ఎండి తహేర్ విద్యార్థులకు సూ చించారు. మంగళవారం అయిజ మున్సిపాలిటీ పరిధిలోని ఆరోరా జూనియర్ కళాశాల విద్యార్థులకు -రక్త దానము - సామాజిక సేవ అనే అంశంపై ఆయన అవగాహన కల్పించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ సమాజంలో మంచి గుర్తింపు, పొందవచ్చనన్నారు. అనంతరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు ఈ సమావేశంలో రెడ్ క్రాస్ సభ్యులు ఠాగూర్ కృష్ణ, మోటివేషనల్ స్పీక ర్ వెంకటేష్,ప్రిన్సిపల్ యుగంధర్ గౌడ్, శివరాముడు, మధు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.






