02-07-2025 12:05:24 AM
మాజీ మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కేసీఆర్‌ను తిట్టాలి.. చంద్రబాబును కాపాడాలి అనే ఆత్రుత కనిపించిందని మాజీమంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. సీఎం రేవంత్‌కు, మంత్రి ఉత్తమ్‌కు బనకచర్లపై సబ్జెక్టు లేదని ఎద్దేవా చేశారు. మంగళ వారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తమ నేత హరీశ్ రావు జనవరిలో ప్రెస్‌మీట్ పెట్టాక ఉత్తమ్ పాత తేదీలతో జలశక్తి మంత్రికి లెటర్ రాశారని ఆరోపించారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు బనకచర్ల ప్రతిపాదన ఎక్కడుందని ప్రశ్నించారు. కేంద్రం బనకచర్ల కు పర్యావరణ అనుమతులు నిరాకరించడం తమ పార్టీ విజయమని కమలాక ర్ పేర్కొన్నారు. బనకచర్లపై కేసీఆర్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నా లు ఎన్ని చేసినా సీఎం సఫలం కారన్నారు.
కేసీఆర్, హరీశ్ జపం తప్ప పవర్ పాయిం ట్‌లో ఏమీలేదని ఎమెల్యే కె.సంజయ్ విమర్శించారు. 968 టీఎంసీల హక్కు తో పాటు వృథాగా పోతు న్న 3 వేల టీఎంసీల్లో తెలంగాణ 1,950 టీఎంసీలు కూడా వాడుకోవాలని కేసీఆర్ చెబితే తప్పా అని ప్రశ్నించారు. బనకచర్లపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశా లు నిర్వ హించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.