calender_icon.png 1 July, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో నిరవధిక నిరసన దీక్షలు ప్రారంభం

13-03-2025 07:17:55 PM

మాదిగ ఉద్యోగుల సమైక్య జాతీయ ప్రధానకార్యదర్శి డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు మాదిగ

వర్గీకరణ చట్టం అమలు అయ్యేంతవరకు ఉద్యోగ నియామకాలు ఆపాలి

మునగాల: మునగాల మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు, విగ్రహాల వద్ద ఎమ్మార్పీఎస్ ఎం.ఎస్.పి. అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ, లంజపల్లి శ్రీనుమాదిగల ఆధ్వర్యంలో నిరసన దీక్షలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు మాదిగ, ఎం.ఎస్.పి.జిల్లాఅధికారప్రతినిధి ఏపూరి రాజు మాదిగ,లు దీక్షలను ప్రారంభించి మాట్లాడుతూ... ఎస్సీవర్గీకరణ చట్టాన్ని అమలు చెయ్యకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగలను మోసం చేస్తున్నాడని, దీనికి సాక్ష్యం నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మీద నిలబడకపోవడమని తెలియచేయడం జరిగింది.

ఆగస్టు 1 నాడు సుప్రీం కోర్టు వర్గీకరణ మీద ఇచ్చిన తీర్పును స్వాగతించి, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణ అమలు చేసి మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పింది వాస్తవం కదా అని ప్రశ్నించారు. ఒకవైపు మాదిగల మీద ప్రేమ ఉన్నది అంటూనే ఇంకో వైపు మాదిగలకు అన్యాయం చేస్తూ ఉద్యోగ నియామకాలు జరపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించడం జరిగింది. మాదిగలను, మాదిగ ఉపకులలను మోసం చేసిన రాజకీయ పార్టీలు చరిత్రలో నిలబడినట్లు లేదని హెచ్చరించడం జరిగింది. ఇగ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో మాదిగలు తాడో పేడో తేల్చుకునే రోజు అతి దగ్గర్లో ఉందని హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు మా నిరసన దీక్షలు టెంట్ కిందనే ఉన్నవని, భవిష్యత్తులో మాదిగల నిరసన కార్యక్రమాలు రోడ్ల మీదకు వచ్చేలా రేవంత్ రెడ్డి చేస్తున్నారని తెలియచేయడం జరిగింది. అనంతరం నిరవధిక నిరాహార దీక్షలను ఇరమింపజేసిన ఎమ్మార్పీఎస్ మండలనాయకులు మాజీ యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సోమపంగు గోపి, పాల్గొని నిరసనదీక్షను ఇరమింపజేశారు.