calender_icon.png 12 September, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత వాతావరణంలో హోలీ వేడుకలు జరుపుకోవాలి

13-03-2025 07:10:24 PM

పట్టణ ఎస్ఐ రాజశేఖర్

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలో రంగుల పండుగ హోలీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపు కోవాలని పట్టణ ఎస్ఐ రాజశేఖర్ కోరారు. పట్టణం లోని పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హోలీ పండుగ సందర్భంగా ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తగా   నిర్వహించాలని ఆన్నారు. హోలీ పేరుతో రోడ్డు మీద వెళ్లే సంబంధంలేని వారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లపై గుంపులు గుంపులుగా ర్యాలీలు నిర్వహించవద్దని, మద్యం సేవించి రోడ్లపై అసభ్యంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.